calender_icon.png 13 September, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌పార్టీలో చేరిన ప్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య

13-09-2025 01:37:34 AM

కోనరావుపేట సెప్టెంబర్ 12 (విజయక్రాంతి):రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంగం ఛైర్మన్ బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు,బండ నర్స య్య,వట్టిమల్ల మాజీ  సర్పంచ్,మాజీ ఎంపీటీసీ దర్శనాల శంకరయ్య. తదితరులతో కలసి కాం గ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.వారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా ఫ్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య మాట్లాడుతూ.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,బీసీ బిడ్డ అయినా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. నాయకత్వంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర డం జరిగిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వే ములవాడ నియోజకవర్గన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాడని వారి నాయకత్వంలో పని చేస్తూ ముందుకు పోతామన్నారు.ఈ సందర్బంగా వారితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ఫాష,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జెగన్మోహన్ రెడ్డి,తదితరులు వున్నారు.