calender_icon.png 13 September, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ స్వగృహ ‘బిడ్’ దక్కడం అభినందనీయం

13-09-2025 01:39:40 AM

ఖమ్మం ఉద్యోగులకు కలెక్టర్ అనుదీప్ ప్రశంస

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): రాజీవ్ స్వగృహకి సంబంధించి  ఉద్యోగుల హౌస్ బిల్డింగ్ సొసైటీ బిడ్‌ను ఖమ్మం జిల్లా ఉద్యోగులు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని ఉద్యోగ సంఘాల నాయకులు కలిశారు. ఈ  సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాజీవ్ స్వగృహ ప్లాట్స్ దక్కించుకోవడానికి ఉద్యోగ సంఘాలు చేసిన ప్రయత్నాన్ని అభినందించారు.

రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక ఒరవడి కలిగిన ఖమ్మం జిల్లా ఉద్యోగులు ఐక్యతతో ముందుకు సాగుతూ టెండర్‌ను దక్కించుకొని విజయాన్ని అందుకున్న మీరు ఈ ప్రాజెక్టును విజయవంతం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శవంతంగా నిలవాలని కోరారు. ఫ్లాట్స్ అందరూ వినియోగించే  విధంగా వారికి దాని యొక్క ప్రాధాన్యతను వివరించినందుకు ముఖ్యంగా ఫ్లాట్స్ కి సంబంధించిన విధి విధానాలు తెలియజేసినందుకు అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి కొనిదెన శ్రీనివాసరావు, టిజీఓ జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి, టీజీవో హౌస్ బిల్డింగ్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ పి విజయకుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు సూరంపల్లి రాంబాబు, బి .శారద, వై. మంజుల, బి నాగేంద్ర కుమారి, టిఎన్జీఓస్ రాష్ట్ర కార్యదర్శి జైపాల్, వెంకన్న, దుర్గా ప్రసాద్, హరికృష్ణ కోణార్, ప్రభాకరాచారి రుక్మారావు, రమేష్, దిలీప్, సాయి, ఆస్లామ్, శంకర్, మంగ పాల్గొన్నారు.