16 April, 2026 | 9:38 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

బీజేపీలో చేరిన పీఏసీఎస్ చైర్మన్

30-04-2024 12:19 AM

జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పీఏసీఎస్ చైర్మన్ చల్లా నారాయణరెడ్డి సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు, కేంద్ర మంతి కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముం దు టీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న ఆయన మం థని ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. టికెట్ పుట్ట మధుకు కేటాయించడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి చేరారు. అక్కడ టికె ట్ ఆశించిన ఆయనకు నిరాశే ఎదురైంది. ఆ పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీలోకి వెళ్లి ఎట్టకేలకు టికెట్ సంపాదించారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ బీఎ స్పీ పార్టీకి రాజీనామా చేసి తిరిగి బీజేపీలో చేరారు. బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, మురుగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన భూపాలపల్లి మాజీ గ్రంథాలయ చైర్మన్ నం గావత్ రాజేశ్ నాయక్ బీజేపీలో చేరారు.