16 April, 2026 | 11:17 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

బీఆర్‌ఎస్ పతనం ప్రారంభమయింది

30-04-2024 12:17 AM

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి 

చొప్పదండి, ఏప్రిల్ 29(విజయక్రాంతి): రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పతనం ప్రారంభమయ్యిందని, పార్లమెంట్ ఎన్నికల తరువాత ఆ పార్టీ కనుమరుగవనుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధరలోని కాంగ్రెస్ కార్యాలయంలో రామడుగు మండలానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు సోమవారం ఆయన సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. రామడుగు మండలం కొక్కెరకుంట సింగిల్ విండో చైర్మన్, మాజీ జడ్పీటీసీ వొంటెల మురళీకృష్ణారెడ్డితోపాటు పలువురు ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు కాంగ్రెస్‌లో చేరగా, ఎమ్మెల్యే కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని స్పష్టంచేశారు. పార్టీ నాయకులు ఇతర పార్టీల్లో చేరడంతోనే బీఆర్‌ఎస్ పతనం మొదలైనట్టు అని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ హరీశ్,  కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి, సీనియర్ నేతలు రాజమల్లయ్య, రమేష్, అంజనేయులు, సుధాక ర్, తదితరులు పాల్గొన్నారు.