16 April, 2026 | 8:06 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రజలను మోసం చేస్తున్నాయి

30-04-2024 12:21 AM

గ్రేటర్ వరంగల్ మాజీ మేయర్ గుండా ప్రకాష్‌రావు

వరంగల్ తూర్పు, ఏప్రిల్ 29 : దేవుడి పేరు చెప్పి దేశ ప్రజల చూపును మరల్చి జాతి సంపదను కార్పొరేట్ సంస్థలకు దారపోస్తూ కేంద్రంలో బీజేపీ, ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, స్కాంలతో బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశా యని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ గుండా ప్రకాష్‌రావు విమర్శించా రు. సోమవారం వరంగల్ వాసవీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఆర్యవైశ్య సంఘాల మద్దతును కాంగ్రెస్ అభ్యర్థి కడి యం కావ్యకేనని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు పదేండ్లుగా చేసిన అన్యా యం, అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. విదేశాల నుంచి నల్లదనాన్ని దేశానికి తీసుకొచ్చి ప్రతి పేద కుటుంబానికి రూ.15 లక్షలు అందిస్తానని ప్రగల్బాలు పలికిన మోదీ.. నేడు ప్రజల ముందుకు ఏ మోహం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోనుపునూరి వీరన్న, వరంగల్ జిల్లా అవోపా అధ్యక్షుడు మల్యాల వీరమల్లయ్య, వాసవీ క్లబ్ వరంగల్ అధ్యక్షుడు బెలిదే వెంకటేశ్వర్లు, గుండా మల్లి కార్జున్, తదితరులు పాల్గొన్నారు.