పాదయాత్ర పోస్టర్ విడుదల
కొత్తపల్లి, ఏప్రిల్ 24(విజయక్రాంతి):ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పెండింగ్ స్కాలర్షిప్స్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని ఈ నెల 28న ముఖ్యమంత్రి ఇంటికి పాదయాత్ర కార్యక్రమ గోడ పత్రికను శుక్రవారం కరీంనగర్ నగరంలోని గణేష్ నగర్ లో విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్బంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నూనావత్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఫీజు బకాయి విడుదల కాక ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజులు కట్టి పరీక్ష ఫీజులు కట్టాలని, హాల్ టికెట్స్, సర్టిఫికెట్లు తీసుకోవాలని వేధిస్తున్నాయనీ ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు పేద,
మధ్య తరగతి విద్యార్థులకు వ్యతిరేకంగా ఉందని ఫీజు రియింబర్స్మెంట్ రాని విద్యార్థుల వద్ద నుండి ఫీజులు వసూలు చేసుకోమని వచ్చిన తర్వాత విద్యార్థులకు చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనది కాదని ఈ తీర్పుపై ప్రభుత్వం ఇప్పటికి స్పందించకుండా మౌనంగా ఉండడం వల్ల ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, రాష్ట్రంలో లక్షలాదిమంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పై ఆధారపడి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.
అలాంటి ఫీజు రియింబర్స్మెంట్ పథకానికి బకాయిలు ఇవ్వకుండా గత నాలుగు సంవత్సరాలుగా ప్రభు త్వాలు విద్యార్థుల చదువులతో చెలగాటమాడుతున్నాయని, రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తున్నారని, హైకోర్టు తీర్పును పున సమీక్షించి ఆలోచించాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రతి విద్యార్థి ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే ముఖ్య మంత్రి ఇంటికి పాదయాత్రకు తరలిరావాలని హేమంత్,శ్రీనివాస్ నాయక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు కసిరెడ్డి సందీప్ రెడ్డి, నాయకులు రిషి, సువాస్, ఈశ్వర్, అభి , ఏనోష్,విష్ణు తదితరులు పాల్గొన్నారు.






