24 August, 2026 | 8:48 PM

స్కాలర్ షిప్ బకాయిల విడుదలకై నల్ల బ్యాడ్జీలతో నిరసన

24-08-2026 05:50 PM

బాన్సువాడ, ఆగస్టు 24 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్. స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు చేపడుతున్న 48 గంటల నిరహార దీక్షకు మద్దతుగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఫీజుల బకాయి- బీజేపీ లడాయి మీద అంబేద్కర్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కొనాల గంగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్న రూ.15000 కోట్ల రూపాయల విడుదల చేయకపోవడంతో 40 లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని చాలామంది విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లలేక చదువులను మధ్యలో ఆపేయడం జరుగుతుందన్నారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థుల యొక్క స్కాల షిప్ లను వెంటనే విడుదల చేసి విద్యార్థుల యొక్క చదువులు కొనసాగే లాగా చూడాలని లేనిచో బిజెపి ఆధ్వర్యంలో విద్యార్థుల యొక్క స్కాల షిప్ విడుదల చేసే వరకు విద్యార్థులచే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు చీదురు సాయిలు బిజెపి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ బిజెపి కౌన్సిలర్ గజ్జల మహేష్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి ఉమేష్ బిజెపి జిల్లా కౌన్సిల్ నెంబర్ తృప్తి ప్రసాద్ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి బిజెపి నాయకులు గురుకుల శ్రీనివాస్ లక్ష్మీనారాయణ చీకట్ల రాజు పాశం భాస్కర్ రెడ్డి శ్యామల శ్రీకాంత్ కొండని గంగారం పురుషోత్తం సచిన్ సందీప్ మహేందర్ ఫణిందర్. భూమేష్ లక్ష్మణ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.