24 August, 2026 | 8:19 PM

Breaking News

టీపీసీసీ చీఫ్‌కు రామాయంపేట నేతల ఘన స్వాగతం

24-08-2026 05:43 PM

రామాయంపేట, ఆగస్టు 24(విజయక్రాంతి): కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ మెదక్‌ పర్యటనకు వెళ్తూ మార్గమధ్యంలోని రామాయంపేటలో ఆగారు. ఈ సందర్భంగా ఆయనకు సోమవారం నేతలు,కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నేతలు పోటీలు పడి శాలువాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ ఉదయం కామారెడ్డి నుంచి రామాయంపేట మీదుగా వెళుతున్న ఆయన..మెదక్ బ్రిడ్జి వద్దకు రాగానే కాంగ్రెస్ జిందాబాద్ అంటూ కార్యకర్తలు ఇచ్చిన నినాదాలు మిన్నంటాయి. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రామాయంపేట బైపాస్ రోడ్డులో సందడి నెలకొంది. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారంలో మరింత ఉత్సాహంతో పనిచేయాలని నేతలు కార్యకర్తలకు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మహేష్ కుమార్ గౌడ్ కు స్వాగతం పలికిన వారిలో రామాయంపేట మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, దుబ్బాక కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చారి చెరకు ముత్యంరెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు లు ఉన్నారు.