27-10-2025 05:15:35 PM
వల్లభాపురంలో వరి పంట క్షేత్ర ప్రదర్శన
చివ్వెంల (విజయక్రాంతి): వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “నాణ్యమైన విత్తనం - రైతన్నకు నేస్తం” కార్యక్రమం భాగంగా వల్లభాపురం గ్రామంలో KNM-1638 (BPT-5204) వరి పంట క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ భద్రు నాయక్ పాల్గోని రైతులకు విత్తనోత్పత్తి, పంట సంరక్షణపై సూచనలు ఇచ్చారు. నాణ్యమైన విత్తనం వాడితే దిగుబడి 10-15% వరకు పెరుగుతుందని నాణ్యమైన విత్తనం వాడిన పక్షంలో అదే విత్తనాన్ని రెండు నుండి మూడు సంవత్సరాల వరకు వాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి డి. వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు.