27-10-2025 05:08:18 PM
ఏఎంసీ చైర్మన్ ఎల్లేష్ యాదవ్..
బోయినపల్లి (విజయక్రాంతి): ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం బోయిన్పల్లి మండలం గుండ్లపల్లి, మల్కాపూర్, అనంతపల్లి, దేశయిపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర చెల్లించేందుకే గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు.
అందుకు రైతులందరూ ధరలకు విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించుకోవాలని ఆయన కోరారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, తాసిల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో బీమా జయశీల, కాంగ్రెస్ నాయకులు ఆ గ్రామాల మాజీ సర్పంచులు పాల్గొన్నారు.