calender_icon.png 27 October, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం షాపులు పొందిన వారు వెంటనే నగదు చెల్లించాలి

27-10-2025 05:17:59 PM

నిర్మల్ (విజయక్రాంతి): నూతన ఎక్సైజ్ పాలసీల భాగంగా సోమవారం నిర్వహించిన లక్కీ టెండర్లలో మద్యం షాపులు దక్కించుకున్న వారు ప్రభుత్వం సూచించిన మొదటి త్రైమాసిక రుసుమును వెంటనే చెల్లించాలని ఎక్సైజ్ సీఐ అబ్దుల్ రజాక్ తెలిపారు. జిల్లాలో మొత్తం 47 మంది షాపులకు లైసెన్సులను జారీ చేయడం జరుగుతుందని వారు వెంటనే 10 లక్షలు డిపాజిట్ చేయవలసి ఉంటుందన్నారు. ఇందుకోసం ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని మంగళవారంలోపు మొదటి విడత డబ్బు చెల్లించిన వారికి మాత్రమే షాపు అనుమతి ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినించుకోవాలని కోరారు.