1 August, 2026 | 4:23 PM

Breaking News

రిఫీలింగ్ సెంటర్లపై దాడి.. 16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం   •   అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి   •   విద్యార్థులకు అండగా నిలబడడమే 'యూత్ ఫర్ సేవ' లక్ష్యం   •   కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు   •   ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయండి   •   తల్లిపాల వారోత్సవాలు   •   బాచ్‌పన్ ఏహెచ్‌పీఎస్ ప్రైమరీ, బీరంగూడలో ఫ్యాన్సీ డ్రస్ పోటీలు   •   మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో సమయపాలన పాటించని సర్పంచులు, అధికారులు   •   జనగామను సందర్శించిన హైకోర్టు జడ్జి సూరేపల్లి నందా   •   ఉదయం 11 గంటల నుండి నిలకడగా ప్రవహిస్తున్న గోదావరి వరద   •  

వరి ధాన్యం అన్‌లోడింగ్ వేగవంతం చేయాలి

12-06-2026 12:00 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, జూన్ 11 ( విజయక్రాంతి ) :  గోదాముల వద్ద లారీలు ఎక్కువసేపు నిరీక్షించకుండా వరి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం వనపర్తి మండలం చిట్యాల గ్రామ శివారులోని లక్ష్మీ నరసింహ రైస్ మిల్ గోదామును ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, అన్లోడింగ్ పనులను పరిశీలించారు. లారీలు అధిక సంఖ్యలో వేచి ఉండటంతో కొన్ని లారీలను ఇతర గోదాములకు మళ్లించాలని డీసీఎస్‌ఓకు సూచించారు. హమాలీల సంఖ్యను పెంచి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీఎస్‌ఓ కాశీ విశ్వనాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు.