ఆర్‌వీఎం, ఎయిమ్స్ ఆస్పత్రులకు బస్సులు నడపాలి
మేడ్చల్ అర్బన్, జూన్ 11 (విజయక్రాంతి): భువనగిరి జిల్లా పరిధిలో గల బీబీనగ ర్ ఎయిమ్స్ ఆసుపత్రి, వంటిమామిడి ఆర్. వి.ఎం ఆసుపత్రులకు వెళ్లే వారికోసం కోసం మేడ్చల్ ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సులను నడపాలని బీజేపీ నాయకులు మేడ్చ ల్ ఆర్టీసీ డిపో మేనేజర్ పరిమళకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మేడ్చల్ పరిసర ప్రాంతాల ప్రజలు అత్యవసర వైద్య సేవల కోసం వంటి మామిడిలోని ఆర్.వి.ఎం ఆసుపత్రితో పాటు,బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రు లకు నిత్యం భారీ సంఖ్యలో ప్రజలు వెళ్తుంటారని తెలిపారు. ప్రజలు మెరుగైన వైద్యం కోసం బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రితో పాటు వంటిమామిడి ఆసుపత్రులకు సరైన బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల పేద మధ్య తరగతి కుటుంబాలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బిజెపి నేతలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో తక్కు వ ఖర్చుతో వైద్య సేవలు పొందే కీలకమైన రూట్లలో బస్సుల అవశ్యకత ఎంతైనా ఉంద ని వారు డిపో మేనేజర్ పరిమళకు వివరించినట్లు చెప్పారు.బిజెపి నేతల వినతి పత్రం సమస్యపై మేడ్చల్ డిపో మేనేజర్ పరిమళ స్పందించిన తీరు పట్ల బిజెపి నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారులు నిత్యం ప్రజా క్షేత్రంలో ఉంటూ వారి సమస్యలను ప్రతిబింబించే నాయకుల సలహాలను పెడచెవిన పెట్టడం సరికాదనిని బిజెపి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ అధికారులు ప్రజాసమస్యలపై బాధ్యతారాహిత్య ధోరణి వల్ల అంతిమంగా సంస్థ పేరు దెబ్బతింటుందని,ప్రజల్లో ఆర్టీసీపై నమ్మకం పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రికి,వంటిమామిడి ఆసుపత్రులకు మేడ్చల్ ఆర్టీసీ డిపో నుండి బస్సులు నడపాలని లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తామని బిజెపి నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిజెపి మేడ్చల్ పట్టణ ప్రధాన కార్యదర్శులు చెరుకొమ్ము శ్రీనివాస్ గౌడ్,జాకట ప్రేమ్ దాస్.మహేష్.పార్టీ కార్యదర్శి బండి విష్ణు మూర్తి గౌడ్.సీనియర్ నాయకులు వంశీధర్ రెడ్డి.జిల్లా బిజెవైం కార్యదర్శి బి రాఘవ రెడ్డి.జి నాగరాజు.జనార్దన్ రెడ్డి లతో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






