17 April, 2026 | 11:11 AM

ప్రశాంతంగా ముగిసిన పద్మశాలి సంఘం ఎన్నికలు

15-06-2025 05:20 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని మార్కెట్ ఏరియా పద్మశాలి సంఘం(Padmasali Sangam) ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం పట్టణంలోని శ్రీకృష్ణ గార్డెన్(Srikrishna Garden) వెనకాల గల సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో కుల కుల సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకుముందు కుల దైవం మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు.

ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 470 ఓట్లకు గాను 372 మంది (84 శాతం) కుల సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలకు పరిశీలకులుగా జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు చిలగాని సుదర్శన్, రాష్ట్ర నాయకులు గాదాసు బాపు, రామకృష్ణాపూర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు వనం సత్యనారాయణ, సిసిసి నస్పూర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు దేవసాని నాగరాజు, పట్టణ అడహాక్ కమిటీ సభ్యులు ఓ రాజశేఖర్, పుట్ట సదానందం, పిట్టల సుధాకర్, గోనే శ్రీనివాస్ లు పాల్గొన్నారు. ఈ  ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.