రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి
బిజెపి నల్లగొండ జిల్లా గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు కొర్ర భాస్కర్ నాయక్..
చండూరు/మర్రిగూడ (విజయక్రాంతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి అభ్యర్థుల గెలుపును కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని బిజెపి నల్లగొండ జిల్లా గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు కొర్ర భాస్కర్ నాయక్(BJP District Tribal Morcha Vice President Korra Bhaskar Nayak) అన్నారు. ఆదివారం మర్రిగూడ మండల కేంద్రంలోని రాజపేట తండాలో నరేంద్ర మోడీ 11 సంవత్సరాలు సుపరిపాలన విజయాలపై భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో "వికసిత్ భారత్ రచ్చబండ" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ, నరేంద్ర మోడీ పథకాలపై ప్రజలకు వివరించాలని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చి మోసం చేసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని చెప్పి ఇందిరమ్మకమిటీలలో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగిందని, అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి బిజెపి కార్యకర్త ప్రతి ఇంటికి చేరుకొని ప్రజలకు 11 సంవత్సరాలలో బిజెపి పేదల సంక్షేమానికి చేసిన సేవలను వివరించడం వలన, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయని ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని ఆయనతెలిపారు. "ఆపరేషన్ సింధూర్" విజయంతో దేశ దౌత్య సామరస్యం మరోసారి నిరూపితమైందన్నారు.
ప్రధాని మోదీ దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా పెంచిందన్నారు. బూత్ స్థాయి నుండి బిజెపి పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా బిజెపి మండల అధ్యక్షులు అంగోత్ భాస్కర్ నాయక్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్, మండల అధ్యక్షులు రాజేందర్ నాయక్, గ్యార గోపాల్, కటకం నరసింహ, చాపల వెంకటేష్, ప్రదీప్ రెడ్డి, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు రమావత్ చంద్రకళ, రమావత్ ప్రసాద్, జటావత్ దత్తు, రామావత్ శేషు, అంగోత్ హరి, రమావత్ ఆకాష్, రమావత్ చందర్, రమావత్ దిలీప్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






