26 August, 2026 | 6:57 PM

వర్షపు నీటికి శాశ్వత పరిష్కారం.. 15 కల్వర్టులకు శంకుస్థాపన

26-08-2026 06:08 PM

ప్రజల ఇబ్బందులు తొలగించడమే లక్ష్యం: సర్పంచ్‌ బానోత్‌ సదర్‌లాల్‌

అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలో వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా బుధవారం గ్రామపంచాయతీ చర్యలు చేపట్టింది. అశ్వాపురం నుంచి మొండికుంట, గొందిగూడెం వైపు వెళ్లే బీటీ రోడ్డు నిర్మాణం అనంతరం రహదారి వెంబడి ఉన్న కచ్చా డ్రైన్లు దెబ్బతినడంతో వర్షపు నీరు సక్రమంగా వెళ్లక ఇళ్ల పరిసరాలు,

రోడ్లపై నీరు నిలిచిపోతున్న నేపథ్యంలో సుమారు 15 కల్వర్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామపంచాయతీకి నిధులు పరిమితంగా ఉన్నప్పటికీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చొరవతో పనులు చేపడుతున్నట్లు సర్పంచ్‌ బానోత్‌ సదర్‌లాల్‌ తెలిపారు. వర్షపు నీరు సక్రమంగా వెళ్లేలా కల్వర్టులను నిర్మించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని, అవసరమైన ప్రాంతాల్లో మరిన్ని కల్వర్టులను దశలవారీగా నిర్మిస్తామని పేర్కొన్నారు.