26 August, 2026 | 8:43 PM

దాడికి పాల్పడిన ఎస్సై, కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగించాలి

26-08-2026 06:07 PM

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): తిమ్మాజిపేట్ పోలీస్‌స్టేషన్‌లో అవంచ గ్రామానికి చెందిన పాలమూరు మహేందర్‌ ను విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాస్ రావు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు దాడి చేశారంటూ బీఎస్పీ ఆరోపించింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేందర్‌ను బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ పరామర్శించారు. దాడికి పాల్పడిన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగించి, ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.