26 August, 2026 | 7:07 PM

సామూహిక సీమంతాలు

26-08-2026 06:16 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): అలియన్స్ అలయన్స్ క్లబ్  సిద్దిపేట జిల్లా గవర్నర్ సోమ శివకుమార్ ఆధ్వర్యంలో దుబ్బాక మండలం దుంపలపల్లి గ్రామంలో 40 మందికి గర్భిణి స్త్రీ లకు సామూహికంగా సీమంతాల వేడుకలు బుధవారం నిర్వహించారు. దుంపలపల్లి, పెద్ద గుండవెల్లి, అప్పనపల్లి, బల్వంతాపూర్ గ్రామాల నుండి ఆంగన్వాడి టీచర్ల సహాకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గర్భిణి స్త్రీలకు చీరే, గాజులు, పసుపు, కుంకుమ, 5 రకాల స్వీట్స్, 5హాట్స్, 5 రకాల పండ్లు, గాజులు అందజేసి గర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో అలియన్స్ గవర్నర్ శివకుమార్ వనజ దంపతులు, ఆత్మరాములు, రేణుక, సుజన, సుజాత, నల్ల నాగరాజం, మద్ది సంతోష్ తదితరులు పాల్గొన్నారు.