29 June, 2026 | 2:03 AM

పద్మశాలీ సంఘం మండల కమిటీ ఎన్నిక

29-06-2026 12:00 AM

వెంకటాపూర్, జూన్ 28 (విజయక్రాం తి): మండల కేంద్రంలోని వేదవ్యాస ఉన్నత పాఠశాలలో ఆదివారం పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కల్యాణ వేణుగోపా ల్ ఆధ్వర్యంలో మండల సమావేశం నిర్వహించగా ఈ సమావేశంలో మండల కమిటీ ఎన్నికలను నిర్వహించారు.

మండల అధ్యక్షుడిగా పల్నాటి రమేష్, ప్రధాన కార్యదర్శిగా వెలగొండ మార్కండేయ, సహాయ కార్యదర్శిగా వెలుగొండ రాజేందర్, ఆర్థిక కార్యద ర్శిగా దాసరి రాజు, ప్రచార కార్యదర్శిగా వా లుగొండ రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ఈ సమావేశానికి జిల్లా సలహాదారు భాషని రామ్మూర్తి, ములుగు మండల అధ్యక్షుడు కందగట్ల సారయ్య, ప్రధాన కార్యదర్శి మేతి శ్రీనివాస్ హాజరై నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలిగొండ శంకర్, వంగ జనార్ధన్, రాజేశం, సామల శ్యామ్, సంజీవ్, మల్లయ్య, సమ్మయ్య, సభ్యులు పాల్గొన్నారు.