calender_icon.png 22 February, 2026 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నానికి జోడీగా!

22-02-2026 12:00:00 AM

డాన్స్, కరాటే, నటన వంటి బహుముఖ ప్రతిభతో సినీరంగంలోకి అడుగుపెట్టింది త్రిప్తి డిమ్రీ. తొలినాళ్లలో ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్న ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. బాలీవుడ్‌లో ‘యానిమల్’ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన త్రిప్తి డిమ్రీని సందీప్‌రెడ్డి వంగా ఇప్పుడు టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నారు. తాను ప్రభాస్ హీరోగా రూపొందిస్తున్న ‘స్పిరిట్’ సినిమాలో త్రిప్తి డిమ్రీనే కథానాయికగా ఎంపిక చేశారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభాస్‌తో కలిసి ఉన్న త్రిప్తి ఫస్ట్‌లుక్ పోస్టర్ బాగా వైరల్ అయింది. అందులో త్రిప్తి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చిత్రవర్గాల ద్వారా తెలిసింది. ఇదిలావుండగా, త్రిప్తి డిమ్రీ తాజాగా మరో తెలుగు సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు సమచారం. స్టార్ హీరో నాని నటించనున్న కొత్త సినిమాలో త్రిప్తి డిమ్రీనే కథానాయికగా ఎంపికైనట్టు తెలుస్తోంది. ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమా ట్రెండ్..

కాబట్టి నాని కొత్త చిత్రాన్ని అన్ని భాషల్లోనూ విడుదల చేయనున్నారు. అందుకే ఆ స్థాయిలో ఫేమ్ ఉన్న హీరోయిన్‌ను తీసుకుంటే మార్కెట్ రీత్యా కలిసి వస్తుందనే త్రిప్తిని సెలక్ట్ చేసినట్టు తెలుస్తోంది. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల సినిమా తర్వాత నాని చేయబోయే సినిమా కోసం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. త్వరలో వివరాలు తెలియ జేయనున్నారు.