10 April, 2026 | 5:32 AM

బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్!

22-02-2026 12:00 AM

‘లక్కీ భాస్కర్’తో తెలుగు నాట ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న మీనాక్షి చౌదరి కెరీర్ జోరు మీదుంది. వరుస అవకాశాలు అందుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతోందీ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు ఈ హర్యానా హాట్ బ్యూటీ బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌కు జోడీగా నటించే ఛాన్స్ పట్టేసింది మీనాక్షి.

అక్షయ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘భాగమ్ భాగ్ 2’. 2006లో అక్షయ్‌కుమార్, గోవిందా, పరేశ్ రావల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భాగమ్ భాగ్’ పెద్ద హిట్ అయ్యింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న తాజాచిత్రమే ‘భాగమ్ భాగ్ 2’. పక్కా కామెడీ ఎంటర్‌నర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజ్ శాండిల్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ హైప్ ఉండగా.. ఈ చిత్రంలో కథానాయికగా నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది మీనాక్షి చౌదరి.