10 June, 2026 | 7:26 PM

మడే రాజేష్ కి 'గౌరవ డాక్టరేట్'

10-06-2026 06:20 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): సమాజంలోని పేద పిల్లలకి ఉన్నత విద్యను అందించాలనే సంకలాపాన్ని జీవిత ధ్యేయంగా మార్చుకొని పేద విద్యార్థుల అభున్నతే లక్ష్యంగా నిరంతరంగా సేవని అందిస్తున్న మడే రాజేష్ కి అరుదైన గౌరవం దక్కింది. రాజేష్ చేస్తున్న విశిష్ట సామాజిక సేవలను గుర్తించిన ఏషియన్ వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ సంస్థ ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన మడే రాజేష్ వ్యవసాయ కూలీలు మడే భాగ్యలక్ష్మి, భీమయ్య దంపతుల పెద్ద కుమారుడు.

పేద కుటుంబం నుంచి వచ్చి వృత్తి విద్యా కళాశాల స్థాపించి సమాజం లోని పేద విద్యార్థులు తను అనుభవించిన ఆర్థిక కష్టాలు పడకూడదు అనే సంకల్పంతో ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచిత విద్య, ఉన్నత చదువులు అందించాలని, అవసరమయిన విద్యార్థుల కు అర్థిక సహాయం సామాజిక సేవలను అందిస్తున్నారు. ఈ సేవలకు గాను హైదరాబాద్ లో అవార్డు ప్రదానోత్సవంలో గౌరవ డాక్టరేట్ ను రాజేష్ అందుకోనున్నారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ... తనకి లభించిన గౌరవానికి ఇంకా ఎన్నో సేవ కార్యక్రమాలు చేసేలా నాపై మరింత బాధ్యతను ఉత్సాహన్నీ పెంచిందని ఆనందాన్నీ వ్యక్తపరిచాడు.