19-02-2026 02:31:27 AM
కొలంబో, ఫిబ్రవరి 18 : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ సూపర్-8లో అడుగుపెట్టింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్థాన్ సమష్టిగా చెలరేగింది. నమీబియాతో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 102 పరుగుల భారీ తే డాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 3 వికెట్లకు 199 పరుగుల భారీ స్కోర్ చేసింది.
షాహిబ్జాదా ఫర్హాన్ (58 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 100 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ సల్మాన్ అఘా(23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38), షాదాబ్ ఖాన్(22 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 36 నాటౌట్) రాణించారు. నమీబియా బౌలర్లలో జాక్ బ్రెస్సెల్(2/48) రెండు వికెట్లు తీయగా.. గెర్హార్డ్ ఎరాస్మస్(1/25) ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం నమీబియా 17.3 ఓవర్లలో 97 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. స్టీన్కాంప్(23), అలెగ్జండర్(20) టాప్ స్కోరర్లుగా నిలిచారు.