1 July, 2026 | 8:53 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

పాకిస్థాన్ కాదది టెర్రరిస్థాన్

12-06-2025 12:00 AM

బ్రస్సెల్స్‌లో కేంద్ర మంత్రి జైశంకర్

న్యూఢిల్లీ, జూన్ 11: ‘పాకిస్థాన్ కాదది టెర్రరిస్తాన్. ఉగ్రవాదాన్ని సహించేదే లేదు. ఉగ్ర వాదంతో ఒక్క భారత్‌కే కాదు.. అన్ని దేశాలకు ముప్పుంది.’ అని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. యురోపియన్ యూని యన్ (ఈయూ) భద్రతా వ్యవహారా లు, విదేశాంగ శాఖ ఉన్నతాధికారి కాజా కల్లాస్‌తో కలి సి బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో మీడియాతో మాట్లాడారు. ‘ఉగ్రవాదాన్ని ఇకపై సహించే ప్రసక్తే లేదు.

పాక్ న్యూక్లియర్ బెదిరింపులకు భారత్ ఎప్పుడూ భయపడదు. ఉగ్రవాదం అ నేది రెండు దేశాల మధ్య సమ స్య కాదు.  ఉగ్రవాదంతో ప్రపంచంలోని అన్ని దేశాలకూ ముప్పుంది. ఉగ్రదాడులకు అవకాశం లేకుం డా చేయాలనే లక్ష్యంతోనే భారత బలగాలు ఆపరేషన్ సిందూర్ ద్వారా దాడి చే శాయి. దీన్ని ఇండియా మధ్య వి వాదంలా కాకుండా భారత్ నడుమ వివాదంగా చూడాలి. ’ అని పేర్కొన్నారు.