1 July, 2026 | 7:44 PM

Breaking News

ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •  

యాపిల్ స్టోర్‌లో లూటీ

12-06-2025 12:00 AM
  1. నిరసన ముసుగులో రెచ్చిపోయిన దుండగులు
  2. హింసాత్మక ఘటనలతో లాస్ ఏంజెల్స్‌లో కర్ఫ్యూ

లాస్ ఏంజెల్స్, జూన్ 11: అక్రమ వలసదారుల అరెస్ట్‌కు నిరసనగా లాస్ ఏంజె లెస్‌లో చెలరేగిన ఆందోళనలతో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. ముఖ్యంగా డౌన్‌టౌన్‌లో నిరసనలను ఆసరాగా చేసుకు న్న కొందరు దుండగులు యాపిల్ స్టోర్లు సహా పలు వ్యాపారా కేంద్రాలను లూటీ చే శారు.

నిరసనల పేరుతో ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు యాపిల్ స్టోర్‌లోకి ప్రవేశించి, గ్యాడ్జెట్‌లను దోచేశారు. మరికొన్ని వ్యాపార కేంద్రాల్లోనూ చొరబడి గం దరగోళం సృష్టించారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపుచేశారు. పలువు రు ఆందోళనాకారుల్ని అదుపులోకి తీసుకున్నట్టు పోలీస్ అధికారి మిల్లర్ వెల్లడించారు. 

నిరసన నేపథ్యంలో పరిమిత కర్ఫ్యూ

అక్రమ వలసదారుల అరెస్టుకు నిరసనగా స్థానికులు చేస్తున్న ఆందోళనలు ఉధృ తం కావడంతో లాస్ ఏంజెల్స్‌లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్టు నగర మే యర్ కరెన్ బాస్ పేర్కొన్నారు.  డౌన్‌టౌన్‌లోని పలు ప్రాంతాల్లో  రాత్రి 8 గంటల ను ంచి ఉదయం 6 గంటల వరకు (స్థానిక కాలమానం ప్రకారం) పరిమిత కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు.

డౌన్‌టౌన్‌లో విధ్వంసం సృష్టించి, దుకాణాలను లూటీ చేసిన వారిని ఊరికే విడిచిపెట్టమని హెచ్చరించారు. అక్ర మ వలసదారులను అరెస్ట్ చేసేందుకు అధికారులు సోదాలు చేయడంతో అల్లర్లు చెలరేగాయి. ప్రస్తుతం అవి కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కో, శాంటా అనా, టెక్సాస్‌లోని డల్లాస్, ఆస్టిన్ తదితర ప్రాంతాలకు విస్తరించాయి.