26 April, 2026 | 7:11 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

మహిళతో పాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన

06-03-2026 02:14 AM

కొలంబో, మార్చి 5 : టీ20 ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ జట్టు సూపర్‌లోనే నిష్క్రమించినా.. ఆ జట్టును వివాదాలు మాత్రం వదలడం లేదు. ఈ టోర్నీ సందర్భం గా పాకిస్థాన్‌కు చెందిన ఓ క్రికెటర్ హోటల్ మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినట్లు వెలుగులోకి రావడం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో సంచలనం రేపుతోంది. సూపర్-8 దశలోఆతిథ్య శ్రీలంకతో చివరి మ్యాచ్‌కు ముందు రోజు ఈ ఘటన జరిగింది. కాండీలోని గోల్డెన్ క్రౌన్ హోటల్లో బస చేసిన పాక్ జట్టులోని ఒక ఆటగాడు, హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్న మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడు.

బాధితురాలు గట్టిగా అరిచి సహాయం కోరడంతో తోటి హోటల్ సిబ్బంది ఆమెను రక్షించారు. ఈ విషయాన్ని హోట ల్ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుని పాకిస్థాన్ టీమ్ మేనేజర్ నవైద్ చీమాకు ఫిర్యాదు చేసింది. హోటల్ మేనేజ్‌మెంట్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవగా నవైద్ చీమా పాక్ జట్టు తరపున క్షమాపణలు చెప్పారు. అనంతరం సదరు క్రికెటర్‌కు భారీ జరిమానా విధించి విషయాన్ని సద్దుమణిగేలా చేశారు. సదరు ఆటగాడి పేరును మేనేజ్‌మెంట్ ఇంకా గోప్యంగా ఉంచినప్పటికీ.. అతనిపై పాక్ బోర్డు చర్యలు తీసుకోనుంది.