18 April, 2026 | 3:57 PM

Breaking News

మినీ గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ   •   మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •   మహిళా బిల్లు వీగిపోవడం— బీజేపీ విధానాల ఓటమి   •   దేశ మహిళలకు అన్యాయం.. కాంగ్రెస్, బీజేపీ‎ల‎పై హరీశ్‎రావు కీలక వ్యాఖ్యలు   •   వర్క్ షాప్ కోసం అనుమతి ఇవ్వండి   •   కరీంనగర్ లో విజయక్రాంతి వార్షికోత్సవ వేడుకలు   •   రాఘవపేటలో బడిబాట కార్యక్రమం   •  

జిల్లాలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, రోహింగ్యాలను గుర్తించి అరెస్టు చేయాలి

08-05-2025 12:00 AM

కలెక్టర్‌కు బీజేపీ నాయకులకు వినతి

కామారెడ్డి, మే 7 (విజయ క్రాంతి):  కామారెడ్డి జిల్లాలో ప్రత్యేక సర్వే చేసి, కాటన్ సెర్చ్ నిర్వహించి జిల్లాలో ఉన్న రోహింగ్యాలను అరెస్ట్ చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో బుధవారం వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడి అనంతరం జరిగిన పరిణామాల్లో భాగంగా పాకిస్థాన్ వారిని దేశం నుండి వెళ్ళిపోవాలని కేంద్ర ఆదేశించడం జరిగిందన్నారు.

ఆ యొక్క ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని, అదే విధంగా జిల్లాలో అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశ్ వారిని, రోహింగ్యాలను గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.  జిల్లాలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యాల విషయమై ప్రత్యేక సర్వే చేసి, కాటన్ సెర్చ్ నిరవించి అరెస్ట్ చేయాలని బీజేపీ కామారెడ్డి జిల్లా శాఖ తరుపున  కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

కార్యక్రమంలో బిజెపి నాయకులు జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు, కుంట లక్ష్మారెడ్డి, మోహన్ రెడ్డి, ఆకుల భరత్ కుమార్ ,రాజు పటేల్ , నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.