calender_icon.png 9 May, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అవగాహన

08-05-2025 12:00:00 AM

రాజంపేట ,మే 7 ( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో రైతులకు జిల్లా వ్యవసాయ అధికారిని  అపర్ణ ఫార్మర్స్ రిజిస్ట్రీ గురించి బుధవారం అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ఆధార్ తో దేశంలో ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చి నట్లుగానే ఫార్మా రిజిస్ట్రీ ప్రక్రియతో ప్రతి రైతుకు 11 నెంబర్ల విశిష్ట సంఖ్య కేటాయించాలని కేంద్రం యొక్క అనుసంధానంతో ఈ ప్రక్రియ వ్యవసాయ శాఖ ప్రారంభించిందన్నారు.

భూమి ఉన్న ప్రతి రైతు తనకున్న భూములకు సంబంధించిన వివరములతో కూడిన సమాచారంతో ఈ ఫార్మర్స్ రిజిస్ట్రీ నిర్మించబడుతుందన్నారు. దీనికి రైతులందరూ ఆధార్ కార్డు లింకు ఉన్న సెల్ ఫోన్ , ఆధార్ కార్డ్ , పట్టా పాస్ బుక్ తెచ్చుకొని తన సమీప వ్యవసాయ విస్తరణ అధికారి నీ సంప్రదించాలి అని తెలిపారు.

ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ఐడి తో పిఎం కిసాన్  ముందు ముందుగా కొనుగోలు ప్రక్రియకు, బ్యాంకు రుణ సౌకర్యానికి ఈ నెంబర్ అనేది ముందు ముందు ఉపయోగపడుతుందని వ్యవసాయ శాఖ ద్వారా తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అధికారులు రైతులు పాల్గొన్నారు.