08-05-2025 12:00:00 AM
ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, మే 7 (విజయక్రాంతి): పహల్గాంలో ఉగ్రవాద చర్యలకు ప్రతికార చర్యగా ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలో అపరేషన్ సిందూర్ విజయవంత మైందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శం కర్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఆపరేషన్ సిందూర్ విజయవంతం పై ప్రధాని మోదీకి ధన్యవాదలు తెలిపారు.
పహెల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి ఆపరేషన్ సిందూర్ విజయవం తంతో ఆత్మకు శాంతి చేకురుతుందన్నారు. ఈ ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత దేశం వైపు చూడాలంటే ఇతర దేశాలకు వణుకు పుట్టించేలా మన సైన్యం పని చేసిందన్నారు. మరోవైపు ఆదిలాబాద్ పత్తి కొనుగోలులో అక్రమాలు జరిగాయని, ఆ అక్రమాలలో తన సహకారం ఉందని మాట్లాడిన మాజీ మంత్రి జోగు రామన్న మాటల్ని ఖండిస్తున్నానని పాయల్ శంకర్ అన్నారు.
ఎండల తీవ్రతకు జోగు రామన్న మతిభ్రమించి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వ్యవసాయ శాఖ మంత్రికి తాను ఫిర్యాదు చేస్తేనే ఆదిలాబాద్‌లో కొన్ని జిన్నింగ్ మిల్లులు ఎక్కువ పత్తి కొనుగోలు చేశారని ఆరోపణలు వస్తున్నాయని చెప్పా రు.
రైతుల గురించి జోగు రామన్న మాట్లాడేటప్పుడు... ఆదిలాబాద్‌లో జరిగిన అనేక కుంభకోణాలులో ఆనాడు రామన్న మంత్రి గా ఉన్నప్పుడు పేపర్లలో టీవీలలో వార్తలు వచ్చాయని, తనపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలి సూచించారు. పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.