10 June, 2026 | 2:50 AM

16 నెలలు.. 6 ఉపగ్రహాలు

10-06-2026 12:40 AM

చైనా సాయంతో పాక్ ప్రయోగం

భారత సైన్యం కదలికలపై నిఘా

‘ఇస్రో’ ఎదుట సరికొత్త సవాళ్లు

ఇస్లామాబాద్, జూన్ ౯: చైనా సహాయ సహకారాలతో పాకిస్థాన్ అంతరిక్ష ప్రయోగాలకు పదునుపెట్టింది. భారత సరిహద్దుల్లో సైన్యం కదలికలపై నిఘా పెట్టేందుకు సొంత ఉపగ్రహ వ్యవస్థను పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నది. దీనిలో భాగంగానే గడిచిన ౧౬ నెలల్లో ఆరు ఉపగ్రహాలను ప్రయోగించింది.

ఈ ఉపగ్రహాలు కేవలం భారత భూభాగాలపై నిఘా పెట్టేందుకేనని నిపుణులు పేర్కొంటున్నారు. పాకిస్థాన్ అంతరిక్ష సంస్థ ‘సుపార్కో’ 1961లో ఏర్పాటైనప్పటికీ, ఆ సంస్థ గడిచిన దశాబ్దంలో చెప్పుకోదగిన ప్రయోగాలేవీ చేయలేదు. కానీ, గతేడాది భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. వెన్నులో వణుకు పుట్టేలా భారత్ దాడులు చేయడంతో పాక్ అప్రమత్తమైంది. ఆరు ఉపగ్రహాల్లో ‘హెచ్‌ఎస్ భూభాగాలపై ఉన్న వస్తువుల కదలికలను గుర్తిస్తుంది.

‘పీఆర్‌ఎస్సీఈవో ‘పీఆర్‌ఎస్సీఈవో ఉపగ్రహాలు పూర్తిగా ఏఐ సాంకేతికతతో రూపొందించినవవి. సేకరించిన సమాచారాన్ని (డేటా) సైతం విశ్లేషించి ‘సుపార్కో’కు చేరవేయడం వీటి ప్రత్యేకత. ముఖ్యంగా రెండు నెలల క్రితం ప్రయోగించిన పీఆర్‌ఎస్సీఈవో అయితే, ప్రత్యేకంగా జమ్మూకశ్మీర్ సహా ఉత్తర భారతంపై నిఘా పెట్టేందుకే ప్రయోగించడం గమనార్హం. ఈ పరిణామాలన్నీ భారత్‌కు సవాల్‌గా మారాయని, పొరుగు దేశాల ఎదుర్కొనేందుకు ‘ఇస్రో’ మరిన్ని ఉపగ్రహ ప్రయోగాలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.