యువతకు ప్రధాని మోదీ ధన్యవాదాలు.. మరో వీడియో విడుదల
థ్యాంక్యూ.. థ్యాంక్యూ దోస్త్
న్యూఢిల్లీ: పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడేవారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాన్ని తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తూ తాను చేసిన వీడియోకు లభించిన స్పందనలు, సానుకూల సూచనల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ లీకేజీలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలతో కూడిన కొత్త బిల్లును, వచ్చే వారం జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ఆ వీడియో సందేశంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఆయన షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ప్రధాని ప్రకటించిన ముసాయిదా బిల్లుకు నిన్న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిన్న తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా విడుదల చేసిన తాజా వీడియో సందేశంలో, ''మీ ప్రేమ ఇలాగే కొనసాగాలి.. మన బంధం ఎప్పటికీ పటిష్టంగానే ఉంటుంది. నా వీడియో చూసి సలహాలు, సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.'' తెలిపారు. మోదీ 24 గంటల్లో ఒక రీల్‌కు అత్యధిక వీక్షణలు సాధించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. మోడీ వీడియోకు కోటిన్నరకు పైగా లైక్స్, 10లక్షలకుపైగా కామెంట్లు రావడంతో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. మీరు చూపిన ప్రేమ, నమ్మకం.. నాకు బలాన్ని ఇచ్చిందని తెలిపారు.






