25 July, 2026 | 9:48 AM

హైకోర్టు ఆదేశాల మేరకు సర్పంచ్ పునఃనియమించిన జిల్లా కలెక్టర్

25-07-2026 08:43 AM

చేగుంట జూలై 25,విజయక్రాంతి: చేగుంట మండలం పోలంపల్లి సర్పంచిగా కొండి రాజ్యలక్ష్మి స్వామి ని తిరిగి నియమిస్తూ మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 10న ఆమెను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. కోర్టు తీర్పు మేరకు పొలం పల్లి రాజ్యలక్ష్మి స్వామి ని సర్పంచ్ గా పునఃనియమిస్తూ జిల్లా కలెక్టర్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు.