10 శాతం ఎస్టీ రిజర్వేషన్‌కు గుర్తుగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

16-09-2026 | 12:15am

తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచిన నాయకుడు కేసీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

ఖమ్మం,(విజయక్రాంతి): తెలంగాణలో గిరిజనులకు 6 శాతం నుంచి 10 శాతానికి ఎస్టీ రిజర్వేషన్(ST Reservation) పెంచి అమలు చేసిన చారిత్రాత్మక నిర్ణయాన్ని స్మరించుకుంటూ, ఖమ్మంలో  తెలంగాణ భవన్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం(BRS Party Office)లో వైరా ఎమ్మెల్యే చంద్రావతి అధ్యక్షతన గిరిజన నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వైరా మాజీ ఎమ్మెల్యే డా. బానోత్ చంద్రావతి మాట్లాడుతూ... గిరిజనుల దశాబ్దాల ఆకాంక్షను గుర్తించి 10 శాతం ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయడంతో పాటు, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి గిరిజనులకు స్వయం పాలన, రాజకీయ ప్రాతినిధ్యం, ఆత్మగౌరవం కల్పించిన ఘనత కేసీఆర్ గారిదేనని పేర్కొన్నారు. “10 శాతం రిజర్వేషన్ అనేది కేవలం శాతం పెంపు కాదు. గిరిజన యువత విద్య, ఉద్యోగాలు, భవిష్యత్తుకు ఇచ్చిన హక్కు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడం గిరిజనుల స్వయం పాలనకు వేసిన బలమైన పునాది” అని అన్నారు.

మరిన్ని వార్తలు