1 August, 2026 | 2:59 PM

సీఎం రేవంత్, పోచారం, కాసుల చిత్రపటాలకు పాలాభిషేకం

01-08-2026 01:57 PM

బాన్సువాడ, ఆగస్టు 1 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మంజీరా పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలను పెంపొందించాలని ఉద్దేశంతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కృషి మేరకు మంజీరా నదిలో 29 కోట్ల రూపాయలతో చెక్ డాం నిర్మాణాలు చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు మంజీరా నదిలో నీరు ప్రవహించడంతో చెక్ డాం నుంచి మూడు కిలోమీటర్ల వరకు నీరు నిలిచిపోవడంతో రైతన్న ఎంతో సంబరపడిపోతున్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ, రైతుల ఆధ్వర్యంలో బీర్కూర్ హనుమాన్ ఆలయం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా రైతులు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు శశికాంత్ మాట్లాడుతూ రైతు పక్షపాతి గా పేరుగాంచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతుల కోసం ఎంతో కృషి చేస్తారని, ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. రైతులకు భవిష్యత్తులో సాగునీటి డోకా ఉండకూడదని ఉద్దేశంతో మంజీరా నదిలో నిర్మాణం చేపట్టిన చెక్ డాం నిర్మాణం పనులు పూర్తయి ఇటీవల కురిసిన వర్షాలకు పొంగి పొర్లుతుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన కృషి ఫలితంగా ప్రస్తుతం మంజీరా పర్యాయక ప్రాంతంలో భూగర్భ జలాలు పెరుగుతాయని కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యామ రాములు, యువజన నాయకుడు శశికాంత్, పట్టణ అధ్యక్షుడు రఘు, మాజీ ఎంపీపీలు ఇండ్ల విజయ ప్రకాష్, టీ ,రఘు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్, సహకార సంఘం అధ్యక్షులు కే గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబలి బస్వరాజ్, ఆనంద్,గంగోండా,రాజు,నాగొండ రైతుల్ ఆకుల బశెట్టి,ఏనుగు పట్ల బశెట్టి,లింగూరం,గంగాధర్,అశోక్,కల సాయి బుడ్డ రాజు తదితరులు పాల్గొన్నారు.