calender_icon.png 23 December, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేషనల్ యోగా ఛాంపియన్‌షిప్‌లో కోట విద్యార్థుల సత్తా

23-12-2025 01:55:49 AM

ముకరంపుర, డిసెంబరు 22 (విజయ క్రాంతి): నేషనల్ లెవెల్ యోగా ఛాంపియన్షిప్ పోటీల్లో కోట పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సత్తా చాతారు. బెల్లంపల్లి పట్టణంలో ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి యోగా పోటీల్లో 6 నుంచి 13  సంవత్సరాల వయసు విభాగంలో కోట పబ్లిక్ స్కూల్ విద్యార్థినికి ప్రథమ స్థానం లభించింది. ఈ పోటీల్లో పాఠశాల విద్యార్థులు మొత్తం 19 బంగారు, 12 వెండి పతకాలు సాధించారు.

సమీక్ష్ రెడ్డి, శ్రీ నిత్య, నిహస్వీ, నితిక్ష, వర్ణిక రెడ్డి, శ్రీమాన్, సాత్విక్ రావు, శ్రీయాంష్ రెడ్డి, ఇంద్రదేవ్, శ్రీ హర్షిత్, తేజష్, జోయల్, రుద్రాక్ష బంగారు పతకాలు సాధించగా, వేదాంశ్, అభిరామ్, అక్షర, శివతేజ, రితిక్, ప్రఖ్యాత్, శ్రీశాంత్, చైతన్య, తదితరులు వెండి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా కోట పబ్లిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ డి. అంజిరెడ్డి విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, యోగా శిక్షకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.