ఇంగ్లిష్ మీడియంకే మొగ్గు!
పిల్లలను తెలుగు మీడియంలో చేర్పించేందుకు ఇష్టపడని తల్లిదండ్రులు
సర్కారు బడుల్లో 22.42 లక్షల మంది విద్యార్థుల్లో 17.65 లక్షలు ఇంగ్లిష్ మీడియమే
ప్రైవేట్‌లో 36 లక్షల మంది విద్యార్థుల్లో 35 లక్షలు ఇంగ్లిష్ చదువులే
హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): ప్రజల ఆలోచనా విధానాల్లో వస్తున్న మార్పులు, పోటీ ప్రపంచంలో భాగంగా ఇంగ్లిష్ మీడియం చదువుతున్నవారి సంఖ్య పెరుగుతున్నది. కొన్ని దశాబ్దాల క్రితం కేవలం ఆర్థికంగా ఉన్నవారు, అగ్రవర్ణాలకే పరిమితమైన ఇంగ్లిష్ మీడి యం చదువులు ఇప్పుడు క్రమంగా బలహీనవర్గాలు కూడా వాటిని అందుకుంటున్నాయి. ఇంగ్లిష్ మీడియం చదువులతోనే తమ పిల్లల భవిష్యత్తు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఆధారపడి ఉన్నాయని గ్రహించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు కూడా తమ పిల్లలను ఎక్కువగా ఇంగ్లిష్ మీడియంలోనే చదివించేందుకు ఇష్టపడు తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు మీడియం చదువుతున్నవారి సంఖ్య తగ్గిపోతుంటే, ఇంగ్లిష్ మీడింయలో చదువుతున్నవారి సంఖ్య పెరుగుతున్నది. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లలో చదువు తున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారు. విద్యాశాఖ గణాంకాలు కూడా ఇదే స్పష్టంచేస్తున్నాయి.
ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లోనూ ఇంగ్లిషే..
రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులు 22,42,076 మంది ఉంటే.. వీరిలో తెలుగు మీడియంలో విద్యార్థులు 3,51,221 (15.66 శాతం) మందికాగా, ఇంగ్లిష్ మీడియంలో 17,65,640 (78.75 శాతం) మంది ఉన్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ బడుల్లో మొత్తం 36,19,289 మంది చదువుతుండగా, ఇందులో తెలుగు మీడియం కేవలం 17,329 (0.5) శా తం మందే. ఇక ఇంగ్లిష్ మీడియంలో ఏకంగా 35, 13, 789 (97.10 శాతం) మంది ఉండటం గమనార్హం. ప్ర భుత్వ, ప్రైవేట్‌లోనే కాదు ఎయిడెడ్ పాఠశాలల్లోనూ పరిశీలిస్తే 59,140 మంది విద్యార్థులకు 8,420 (14.24 శాతం) మంది తెలుగు మీడియం, 45,054 (76.18 శాతం) మంది ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారు.
సర్కారు కంటే ప్రైవేట్‌లోనే ఎక్కువ మంది..
క్రమంగా పాఠశాలల్లో తెలుగు మీడియం కనుమరుగవుతున్నది. మరోవైపు ఇంగ్లిష్ మీడియం చదువులు ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్నప్పటికినీ తల్లిదండ్రులు ఎక్కువగా తమ పిల్లలను ప్రైవేట్‌లో చదివిం చేందుకే ఇష్టపడుతున్నారు. స్థోమతకు తగ్గట్టుగా చిన్నాచితకా ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించేందుకు మొగ్గుచూ పుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రీప్రైమరీ తరగతులు లేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. 33 జిల్లాల్లో 15,490 మంది విద్యార్థులతో 1,362 ప్రీప్రైమరీ సెక్షన్లను ప్రభుత్వం ప్రారంభించింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను 4 వేల నుంచి 5 వేలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది.




