14 April, 2026 | 5:00 PM

Breaking News

షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ పలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •   అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం   •   ప్రమాదరహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీజీపీ శివధర్ రెడ్డి   •   కొండంత పని చేస్తున్నాం.. గడప గడపకూ చెప్పండి!   •  

గాడి తప్పిన పంచాయతీ పాలన

23-06-2025 12:00 AM
  1. చెరువునే యార్డ్‌గా మార్చిన వైనం 
  2. పత్తాలేని ప్రత్యేక అధికారి

బెజ్జూర్, జూన్ 22 (విజయక్రాంతి): బెజ్జూర్ మేజర్ గ్రామపంచాయతీ పాలన ఆస్తవ్యస్తంగా తయారైంది. పాలకవర్గం లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేక అధికారుల పాలన గాడి తప్పిందనడానికి బెజ్జూర్ గ్రామపంచాయతీ నిదర్శనంగా నిలుస్తుంది. బెజ్జూర్ మండలానికి జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించడంతోపాటు గ్రామ పంచాయ తీకి సైతం ఆయననే కేటాయించారు.

సదరు అధికారికి జిల్లా స్థాయిలో రెండు శాఖల కు అధికారిగా వ్యవహరించడంతో బెజ్జూ రు పంచాయతీ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దాదాపుగా మూడు నెలలుగా గ్రామపంచాయతీ కి రానీ ప్రత్యేక అధికారి కనీసం పారిశుధ్యంపై కూడా శ్రద్ధ తీసుకో వడం లేదు.

బెజ్జూర్ మేజర్ గ్రామపంచాయతీ కవడంతో చుట్టుపక్కల గ్రామాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది. వ్యాపా ర, వాణిజ్య, వ్యవసాయ పరంగా ప్రజ లు అవసరాల కోసం నిత్యం ఇక్కడికి వస్తుంటారు. గ్రామపంచాయతీ సిబ్బంది పారిశు ద్ధ్యంపై పట్టించుకోకపోవడంతో కాలనీలో దుర్గంధం వెదజల్లుతుంది.

డంపింగ్ యార్డ్‌గా మారిన చెరువు

బెజ్జూర్ గ్రామ సమీపంలోని చెరువును పంచాయతీ అధికారులు డంపింగ్ యార్డ్ గా మార్చేశారు. గ్రామంలో సేకరించిన చెత్తను చెరువు పక్కన వేయడంతో అది కాస్త చెరువులోకి వెళుతుంది. దీంతో ఆ ప్రాంతం  దుర్బల పరిస్థితి నెలకొంది. గ్రామంలో సేకరించిన చెత్తలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండడంతో ఆ ప్రాంతంలో పశువులు వాటిని తిని మృ త్యువాత పడుతున్నాయని పశు పోషకులు ఆరోపిస్తున్నారు.

చెరువులో ప్లాస్టిక్, వ్యర్ధాలు పోవడంతో చేపలు వృద్ధి చెందడం లేదని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. అనాలోచిత వ్యవహారంతో చెరువు ను నాశనం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రహదారి అనుకోనున్న చెరువు వైపు రైతులు పంట పొలాల వైపు వెళ్తుంటారు. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున చెత్తకుప్పలు ఉండడంతోపాటు దుర్గంధం వస్తుం దని రైతులు పేర్కొంటున్నారు.

వాగుకు సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్ చెత్తతో, వ్యర్థ పదార్థాలతో నిండిపోవడంతో ఉద యం ఆరోగ్యం కోసం వాకింగ్ కు, వాగుకు త్రాగు నీటి కోసం వెళ్తే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లు ఉందని ఆందో ళన చెందుతున్నారు. విపరీతమైన దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తెలుపుతున్నారు. 

చెత్త తరలించేవారు లేక ఇబ్బందులు

15 రోజులుగా గ్రామపంచాయతీ కార్యాలయం ముందు నుండి చెత్త తరలించే ట్రాక్టర్ కదలక పోవడంతో గ్రామంలో ఎక్కడికి చెత్త కుప్పలు అక్కడే ఉంటున్నాయని ప్రజలు తెలుపుతున్నారు. ట్రాక్టర్ మరమ్మత్తులు చేయించేందుకు నిధులు లేకపోవడం తో 15 రోజులుగా ట్రాక్టర్ గ్రామపంచాయతీ ముందే నిలిచిపోయింది.

గ్రామంలో విద్యు త్ దీపాలు ఏర్పాటు చేసేందుకు సైతం బడ్జెట్ లేదని, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు 2 నెలల నుండి రావడంలేదని గ్రామ కార్యదర్శి వైకుంఠం తెలిపారు. ప్రభుత్వ నుండి నిధులు రాకపోవడంతోటే గ్రామ అభివృద్ధి కుంటుపడుతుందని గ్రామ కార్యదర్శి తెలిపారు.ఈ విషయంపై వివరణ కోరెందుకు ప్రత్యేక అధికారి కి సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.