16 March, 2026 | 11:04 AM

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

28-09-2024 12:03 AM

సంగారెడ్డి అర్బన్ , సెప్టెంబర్ 27 : ఇంటి నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వడానికి గాను పంచాయతీ కార్యదర్శి.. యాజమాని నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నా రు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ పంచాయతీ లో ఇంటి నిర్మాణ అనుమతుల కోసం ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి  పంచాయతీ కార్యదర్శి షకీర్ రూ.5 వేలు డిమాండ్ చేయగా.. యజమాని ఫిర్యాదు మేరకు మాటువేసిన ఏసీబీ అధికారులు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. షకీర్‌ను అదుపులోకి తీసుకోని విచారణ చేస్తున్నారు.