01-12-2025 11:15:28 AM
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు(Parliament Winter Session) ప్రారంభం అయ్యాయి. డిసెంబర్ 19 వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇటీవల మరణించిన సభ్యులకు లోక్ సభ సంతాపం తెలిపింది. ఆయా సభ్యులు అందించిన సేవలను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గుర్తుచేసుకున్నారు. ధర్మేంద్ర, శ్రీప్రకాశ్ జైస్వాల్ సేవలను స్పీకర్ ప్రస్తావించారు. దివంగత సభ్యుల ఆత్మకు శాంతి చేకూరాలంటూ సభ్యులు మౌనం పాటించారు. అందుల మహిళ క్రికెట్ జట్టుకు లోక్ సభ సభ్యులు అభినందనలు తెలిపారు. క్రమశిక్షణ, దృఢసంకల్పంతోనే అనేక విజయాలు సాధిస్తున్నారని స్పీకర్ కొనియాడారు.