8 July, 2026 | 8:03 PM

Breaking News

నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •  

చెరువును తలపిస్తున్న పాఠశాల ప్రాంగణం

18-03-2026 12:35 PM

క్రిస్టియన్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితి 

షాద్‌నగర్,(విజయక్రాంతి): రాత్రి కురిసిన భారీ వర్షానికి షాద్ నగర్ పట్టణంలోని క్రిస్టియన్ కాలనీ ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల(Government Mandal Parishad Primary School) ఆవరణ చెరువులా మారింది. పాఠశాలలో విద్యార్థులు తిరగడానికి కూడా వీలు లేకుండా పరిస్థితి తయారయింది. చినుకు పడితే చిత్తడే అన్నట్టు పాఠశాల ప్రాంగణంలో వర్షం నీరు చేరడంతో కుంటను మైమరపిస్తుంది.

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు, అదేవిధంగా పరిసరాలు, పరిశుద్ధంగా ఉంటేనే విద్యార్థులు ఆకర్షితులు అవుతారు. వర్షం పడితే పాఠశాలలు చెరువును తలపిస్తుంటే పరిస్థితి మరోలా ఉంటుంది. ఉన్నతాధికారులు ఇలాంటి పాఠశాలల పట్ల ప్రత్యేక చర్యలు తీసుకునే విధంగా చొరవ చూపాలి. అదే సమయంలో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా చూసుకోవాలి. పాఠశాలలో నీరు చెరితే దీని ద్వారా దోమలు, ఈగలు ఇతర పురుగులు క్రిమి కీటకాలతో పాటు విష సర్పాలు వచ్చే ఆస్కారం ఉంది..