17 April, 2026 | 9:30 PM

Breaking News

గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •   సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన   •   హిందూ సమ్మేళనం ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ   •  

స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలి

14-06-2025 12:44 AM

జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్‌ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి

గజ్వేల్, జులై 13: నూతనంగా నియమితులైన ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని శుక్రవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి కండువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

సిద్దిపేట జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తూ పటిష్టతకు కృషి చేయాలని  ఈ సందర్భంగా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కోరారు. అలాగే గతంలోని వివిధ సంఘటనలు, పరిచయాలను ఆయన గుర్తు చేస్తూ పార్టీ అభ్యున్నతి, కార్యకర్తల సంక్షేమం సంబంధించి తన సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.

అలాగే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయాలని సూచించినట్లు డిసిసి అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు.