17 April, 2026 | 11:11 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పాత విద్యుత్ ప్లాంట్ స్థానంలో కొత్త విద్యుత్ ప్లాంట్ నిర్మించాలి

14-06-2025 12:43 AM

నూతన విద్యుత్ ఉత్పాదక కేంద్రం సాధన సమితి డిమాండ్ 

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కేటీపీఎస్ ఓఎన్ఎమ్ కూల్చి వేసిన ప్రాంతంలో కొత్త విద్యుత్ ఉత్పాద కేంద్రం నిర్మించాలని నూతన విద్యుత్ ఉత్పాదక కేంద్రం సాధన సమితి డిమాండ్ చేసింది. శుక్రవారం స్థానిక విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్ హాల్లో రిటైర్డ్ ఫోర్ మెన్ జమున సీతారామరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రసంగించిన వక్తలు పాల్వంచ పరిసర ప్రాంతాల్లో సహజ వనరుల ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, కిన్నెరసాని జలాశయం నుంచి నీటి సరఫరా, సింగరేణి బొగ్గు నిల్వలు కొత్తగూడెం కోయగూడెం మణుగూరు ఇల్లందు ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయని, విద్యుత్ కర్మాగారానికి అవసరమైన స్థలం సిద్ధంగా ఉన్నందున కేటీపీఎస్ లో నూతన విద్యుత్ ఉత్పాదక కేంద్రాన్ని నిర్మించేందుకు అనువైన వాతావరణ ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో కేటీపీఎస్ విద్యుత్ ప్లాంట్ రాష్ట్రంలోనే ప్రధాన విద్యుత్ కేంద్రంగా పేరుందిందని, కేటీపీఎస్ఓఎన్ఎం పాత ప్లాంట్ కావడంతో మూసివేయబడిందని తర్వాత పట్టణ వైభవం క్రమంగా తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాల్వంచకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటే ఈ ప్రాంతంలో 800 మెగావాడ సామర్థ్యం గల రెండు విద్యుత్ ఉత్పాదక కేంద్రాలను నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు ప్రముఖులు హాజరయ్యారు. ఇంజనీరింగ్ అసోసియేషన్ కు చెందిన బ్రహ్మాజీ యాసిన్ మేడం మంగీలాల్ డి ఈ కెమిస్ట్ సంఘం నాయకులు కెరీదర్ సీనియర్ నాయకులు రామకృష్ణ 1104 యూనియన్ నాయకులు కోటేశ్వరరావు రాజేందర్ , యాకోబు 327 నాయకుల మసీద్ 15 35 నాయకులు పుల్లారావు హెచ్ 142 నాయకులు చారి, టిఆర్వికేఎస్ నాయకులు ముత్యాల రాంబాబు, బి.రాంబాబు బిఎంఎస్ డిప్లమా సంఘం నాయకుల వీర్రాజు, సురేషు, కోటేశ్వరరావు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.