2 August, 2026 | 1:40 AM

బస్సు ఎక్కుతున్న ప్రయాణికులే టార్గెట్..

02-08-2026 12:30 AM
  1. నాగోల్లో ముగ్గురు జేబుదొంగలు అరెస్ట్
  2. ఇద్దరు నేరస్తులపై ఇప్పటికే 11 చోరీ కేసులు
  3. రెండు సెల్ఫోన్లు స్వాధీనం.. నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్

నాగోల్, ఆగస్టు 1(విజయ క్రాంతి): బ స్సు ఎక్కే ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని సెల్ఫోన్లు అపహరిస్తున్న ముగ్గురు జేబుదొంగలను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన ఒక ఐఫోన్, ఒక మోటరోలా సెల్ఫోన్ను స్వాధీ నం చేసుకుని న్యాయస్థానం ఆదేశాల మేర కు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. జూలై 31న నాగోల్ చౌరస్తా బస్స్టాప్లో బస్సు కోసం వేచి ఉ న్న నారాయణ రాజ్కుమార్, వెంకటాచారి బస్సు ఎక్కుతున్న సమయంలో కావడి శివ (22) వారితో మాటలు కలిపి దృష్టి మరల్చాడు.

ఇదే అవకాశంగా తీసుకున్న అతని సహచరులు మేకల జగపతి బాబు అలియాస్ జగపతి, బోయ అలియాస్ గార డీ మంజునాథ్ అలియాస్ మంజు ఇద్దరి జే బుల్లోని ఐఫోన్, మోటరోలా సెల్ఫోన్లను అ పహరించి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నాగోల్ పోలీసులు ఆగస్టు 1న నా గోల్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తి రుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపా రు. వారి వద్ద నుంచి చోరీకి గురైన రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో నిందితులు నందనవనం, మీర్పేట్ ప్రాంతాలకు చెందిన వారని, ఆటో డ్రైవింగ్, కూలీ పనులు చేస్తూ చోరీలకు పాల్పడుతున్నట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు మేకల జగపతి బాబుపై వివిధ పోలీస్స్టేషన్లలో 7 సెల్ఫోన్ చోరీ కేసు లు, బోయ అలియాస్ గారడీ మంజున్పా 4 చోరీ కేసులు నమోదైనట్లు గుర్తించారు. అ నంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్కు పంపినట్లు నాగోల్ పోలీసులు తెలిపారు.