8 May, 2026 | 12:36 AM

దేశీ వృక్ష జాతులు పెంచండి.. పర్యావవరణాన్ని కాపాడండి.. పవన్ కల్యాణ్

31-08-2024 04:51 PM

అమరావతి:  వన మహోత్సవం కార్యక్రమంలో నాటబోయే మొక్కల జాతుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. స్థానిక వృక్ష జాతులను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని సూచించారు. మంచి మొక్కలు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడవచ్చని అన్నారు. పర్యావరణ సమతుల్యత, మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్లం అవుతామని చెప్పారు. మన దేశ భౌగోళిక పరిస్థితులకు విరుద్ధంగా ఉండే అన్య జాతుల మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని తెలిపారు. వేగంగా పెరుగుతాయని, ఎవెన్యూ ప్లాంటేషన్ అని, నిర్వహణ ఖర్చులు తక్కువ అనే కోణంలో గత దశాబ్ద కాలంగా కోనో కార్పస్, ఏడు ఆకుల పాల, మడగాస్కర్ ఆల్మన్, ఆస్ట్రేలియా తుమ్మ వంటి అన్య జాతుల మొక్కలను నాటారని  వీటి వల్ల పర్యావరణానికి మేలు కంటే కీడు అధికంగా ఉందని నిపుణులు నిర్ధారించారన్నారు. అన్య జాతుల మొక్కలు భూగర్భ జల సంపద మీద ప్రభావం చూపడంతో పాటు మనిషికి ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు తెస్తాయని చెప్పారు.

దేశీ వృక్ష జాతులంటే.. ?

అరబ్ దేశాల్లో పచ్చదనం కోసం కోనోకార్పస్ జాతి మొక్కలు విరివిగా  పెంచారని తదనంతరం వాటి దుష్ప్రభావాలను తెలుసుకుని అరబ్బులు సైతం  ఈమొక్కను నిషేధించారన్నారు. దేశంలో తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, అస్సాం ప్రభుత్వాలు సైతం నిషేధించాయని గుర్తు చేశారుకానుగ, వేప, రావి, చింత, ఉసిరి, శ్రీ గంధం, మర్రి, అశోక, రేలా, దిరిసెన, మారేడు, నేరేడు, దేవకాంచన, తెల్ల మద్ది, మామిడి, కదంబం, జమ్మి, వెలగ తదితర దేశీయ మొక్కలను పెంచుదామన్నారు.