7 May, 2026 | 11:46 PM

ద్వాదశ రాశిఫలాలు

01-09-2024 04:00 AM

1.-9-.2024 నుండి 7-.9.-2024 వరకు

రామడుగు రంగన్న సిద్ధాంతి :

మేషం

ఈ వారంలో ఈ రాశివారికి గ్రహస్థితి చాలా మంచిగా ఉంది. శుభకార్య నిమిత్తం ధన వ్యయమవుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. పనిభారం ఉంటుంది. ఈ వారం సంతోషంగా సాగుతుంది. యువతీ యువకులకు మంచి ఉద్యోగాలు దొరకుతాయి. అనుకూల వివాహ సంబంధాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ధనలాభం, ప్రమోషన్లు కలుగుతాయి. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు చదువులలో మంచిస్థితిలో ఉంటారు. రైతులు ఆనందంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 75 శాతం అనుకూలత, 25 శాతం ప్రతికూలత ఉంది. 

వృషభం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్య రకంగా ఉంది. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు కలుగుతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, పెండ్లి విషయాలలో ఆలస్యం జరుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారులతో ఒత్తిళ్లు, ధనవ్యయం పెరుగుతాయి. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చికాకుగా ఉంటారు. చదువులలో శ్రద్ధ చూపాలి. రైతులకు లాభాలు ఉండవు-. ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం.- మొత్తం మీద ఈ రాశివారికి 30 శాతం అనుకూలత, 70 శాతం ప్రతికూలత ఉంది. -

మిథునం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచిగా లేదు. ఆలోచించి నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. బంధుమిత్రులతో అనవసర బాధలు కలుగుతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. విద్యార్థులు చదువులలో ముందుంటారు. ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులు, రైతులకు చేసే పనులలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉంది. 

కర్కాటకం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి చాలా మిశ్రమంగా ఉంది. అనుకోని ధనవ్యయం కలుగుతుంది. మానసిక అశాంతి ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలు చేస్తారు. యువతీ యువకులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయి. అనుకూలమైన వారితో వివాహాలు జరుగుతాయి. విద్యార్థులు ఉత్సాహంగా చదువుతారు. ఉద్యోగస్తులకు ధన లాభం కలుగుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు పనులలో సామాన్య లాభం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది.  

సింహం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. మనసు అశాంతిగా ఉంటుంది. ధన వ్యయం అవుతుంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణాలు చేస్తారు. కొందరితో మనస్పర్ధలు ఏర్పడతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. విద్యార్థులకు చదువులలో అనాసక్తి ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశివారికి 30 శాతం అనుకూలత, 70 శాతం ప్రతికూలత ఉంది. 

కన్య

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అ నుకూలంగా ఉంది. శుభకార్యాలు చేస్తారు. చేసే పనులు అనుకూ లిస్తాయి. పోయిన ధనం దొరుకుతుంది. యువతీ యువకులకు కోరుకున్న వారి తో వివాహ నిశ్చయాలు జరుగుతాయి. మంచి ఉద్యోగాలు లభిస్తాయి. విద్యార్థులు అనుకున్న విధంగా చదువులలో ముందుంటారు. వ్యాపారస్తులకు, రైతులకు సంతోషం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 70 శాతం అనుకూలత, 30 శాతం ప్రతికూలత ఉంది. 

తుల

--ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. దూర ప్రయాణాలు చేస్తారు. బంధువులతో వైరాలు ఏర్పడతాయి. పనులలో కొంత అనుకూలత ఉంటుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో ఆలస్యమవుతుంది. విద్యార్థులు శ్రమించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు స్వల్పలాభాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.  

వృశ్చికం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. ధన లాభం కలుగుతుంది. ఆరోగ్యం విషయమై జాగ్రత్త అవసరం. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. యువతీ యువకులకు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులలో ముందుంటారు. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది. 

ధనుస్సు

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. మంచివారితో స్నేహం ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి నిలకడగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. బంధువులతో భేదాలు కలుగుతాయి. యువతీ యువకులకు మంచివారితో వివాహం కుదురుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులలో ఉన్నతిని సాధిస్తారు. వ్యాపారస్తులకు, రైతులకు లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 65 శాతం అనుకూలత, 35 శాతం ప్రతికూలత ఉంది. 

మకరం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్య రకంగా ఉంది. శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ధనం వ్యయమవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో జాప్యం కలుగుతుంది. విద్యార్థులకు చదువులలో పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులు, రైతులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉంది. 

కుంభం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్య రకంగా ఉంది. కాలాన్ని వృధా చేస్తారు. మిత్రులు, బంధువులతో భేదాలు కలుగుతాయి. ధన వ్యయం అవుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు చదువు విషయంలో పట్టుదల అవసరం. వ్యాపారస్తులకు, రైతులకు అశాంతి ఉంటుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

మీనం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. శుభ కార్య నిమిత్తం ధన వ్యయమవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధువులతో సంతోషంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. విద్యార్థులు చదువులలో స్తబ్దంగా ఉంటారు. వ్యాపారస్తులకు, రైతులకు కాలం అనుకూలించదు. ఉద్యోగస్తులు మానసిక అశాంతికి లోనవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.