calender_icon.png 3 December, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పవన్ కల్యాణ్‌ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

03-12-2025 10:43:42 PM

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

మంథని (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఇటీవల పవన్ కల్యాణ్ కోనసీమలో పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు శ్రీను బాబు తీవ్రంగా ఖండించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోనసీమ ప్రాంతంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ నాయకుల దిష్టి వల్ల ఈ ప్రాంతంలోని కొబ్బరి మొక్కలు ఎండిపోయాయంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణలోని రాజకీయ నాయకులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధులు  డిమాండ్ చేస్తున్నారని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని శ్రీను బాబు డిమాండ్ చేశారు.