calender_icon.png 3 December, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమీకృత వ్యవసాయానికి గాను రైతు రత్న అవార్డు ప్రధానం

03-12-2025 10:42:12 PM

చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల మండలంలోని తాళ్ల వెల్లంల గ్రామానికి చెందిన పజ్జురి అజయ్ కుమార్ రెడ్డి సమీకృత వ్యవసాయ విధానాలను అవలంబిస్తూ అధిక దిగుబడి సాధిస్తుండడంతో నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ రైతుగా ఎంపికై బుధవారం హైదరాబాద్ లో పిజిపి ఆర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మేళ కార్యక్రమంలో ఆయనకు రైతు రత్న అవార్డును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనను ప్రత్యేకంగా అభినందించి నూతన విధానాలతో అధిక దిగుబడిలను సాధిస్తున్న ఆయనను సన్మానించారు. రాష్ట్రంలోని ఇతర రైతులు అజయ్ కుమార్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని సమీకృత వ్యవసాయ విధానాలను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని ఆయన  సూచించారు.