03-12-2025 10:45:11 PM
నామినేషన్లు స్వీకరిస్తున్న అధికారులు
గరిడేపల్లి (విజయక్రాంతి): గరిడేపల్లి మండలంలో 8 క్లస్టర్ల పరిధిలో బుధవారం 26 నామినేషన్లు సర్పంచ్ స్థానాలకు, 300 వార్డులకు 28 మంది నామినేషన్లు దాఖలు చేశారని ఎంపీడీవో సరోజ తెలిపారు. మండలంలో 33 గ్రామపంచాయతీల పరిధిలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా 8 క్లస్టర్లుగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మూడో విడత ఎన్నికలు సందర్భంగా బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనట్లు తెలిపారు. 8 క్లస్టర్ల పరిధిలో 26 మంది సర్పంచి పదవికి పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు.
మండలంలోని గానుగ బండలో 2, నామినేషన్లు కొత్తగూడెంలో 1, కాచవారిగూడెంలో 2, రేగులగడ్డ తండా లో 1, కొండాయిగూడెంలో 1, కల్మలచెరువులో 1, వెలిదండలో 1, రంగాపురంలో 2, అప్పన్నపేటలో 1, కుతుబ్బిషాపురం లో 1, పొనుగోడు లో 5, గడ్డిపల్లిలో 3, సర్వారంలో 1, లక్ష్మీపురంలో 1, కోదండరామపురంలో 2, లచ్చ తండాలో 1 నామినేషన్లు దాఖలాలు అయినట్లు ఆమె వివరించారు. ఈ సమావేశంలో ఎంపీఓ ఇబ్రహీం,గరిడేపల్లి కార్యదర్శి నాగేశ్వరరావు,ఆయా క్లస్టర్ల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు,గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.