20 April, 2026 | 3:03 AM

నిలకడగా పవన్ కల్యాణ్ ఆరోగ్యం

20-04-2026 01:21 AM

ఆందోళన చెందొద్దన్న చిరంజీవి

10 రోజులు విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యులు

హైదరాబాద్, ఏప్రిల్ 19: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగిందని ప్రముఖ నటుడు చిరంజీవి సోదరుడి ఆరోగ్యంపై ఆందోళన వద్దని ప్రకటించారు. సాధారణ స్థితికి వచ్చేందుకు వారం సమయం పడుతుందని వైద్యులు చెప్పారన్నారు. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ చిరంజీవి ధన్యవాదాలు తెలియజేస్తూ సామాజిక మాధ్యమంలో సందేశమిచ్చారు.

అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, సినీ ప్రముఖులు కూడా పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పాలనపరమైన అంశాలపై అధికారులతో శుక్రవారం చర్చిస్తుండగా పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వైద్యపరీక్షలు నిర్వహించిన జూబ్లీహిల్స్ అపోలో వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. పదిరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరాతీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.