మరిపెడ సీఐగా పవన్ కుమార్ నియామకం
14-04-2026 12:19 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా ఎల్. పవన్ కుమార్ నియమితులయ్యారు. వరంగల్ టాస్క్ ఫోర్స్ సీఐగా పనిచేసిన ఆయన, సాధారణ బదిలీపై మరిపెడకు వచ్చారు. ఇక్కడ పని చేసిన రాజకుమార్ గౌడ్ వరంగల్ ఐజీ కార్యాల యానికి బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఐ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ను మర్యాదగాపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఐ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రధాన్యతనిస్తానని, ప్రజలకు సత్వర న్యాయం అందేలా కృషి చేస్తానని తెలిపారు.




